స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Sensex
Sensex

ముంబయి: ఒడిదుడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 39 పాయింట్లు లాభపడి 37,350కి పెరిగింది. నిఫ్టీ 18 పాయింట్లు పుంజుకుని 11,048 వద్ద స్థిరపడింది. కాగా నేటి మార్కెట్లో పవర్‌ గ్రిడ్‌, మారుతీ సుజుకీ, యస్‌బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడగా.. టీసీఎస్‌, వేదాంతా, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/