లాభాల్లో ముగించిన మార్కెట్లు

Sensex
Sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాంతాన్ని లాభాల్లో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు ఒక్కసారిగా దూసుకుపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 465 పాయింట్ల వరకు ఎగబాకింది. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, మెటల్ స్టాకుల అండతో భారీ లాభాల్లోకి వెళ్లాయి. అయితే ఐటీ, ఫార్మా స్టాకులు నష్టాల్లోకి జారుకోవడంతో… లాభాలు కొంత మేర తగ్గిపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 247 పాయింట్లు లాభపడి 38,127కి పెరిగింది. నిఫ్టీ 71 పాయింట్లు పుంజుకుని 11,305 వద్ద స్థిరపడింది.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/