రెండో రోజు లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

40 వేల మార్కును అధిగమించిన సెన్సెక్స్

sensex
sensex

ముంబయి:దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాలను కొనసాగించాయి. జూలై 5వ తేదీ తర్వాత సెన్సెక్స్ మరోసారి 40 వేల మార్కును అధిగమించింది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ దాదాపు 315 పాయింట్లు పెరిగింది. అయితే చివరి గంటలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గుచూపడంతో లాభాలు కొంతమేర తగ్గాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 220 పాయింట్ల లాభంతో 40,052కి పెరిగింది. నిఫ్టీ 57 పాయింట్లు పుంజుకుని 11,844 వద్ద స్థిరపడింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/