లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో దూసుకుపోయాయి. ఆర్థిక సంక్షోభం ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఇన్వెస్టర్లలో జోష్ నెలకొంది. దీంతో, ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు… ఆ తర్వాత రాకెట్ లా దూసుకుపోయాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా లాభపడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 793 పాయింట్లు పెరిగి 37,494కి ఎగబాకింది. నిఫ్టీ 229 పాయింట్లు లాభపడి 11,058కి చేరుకుంది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/