స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

Sensex
Sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. నేటి ట్రేడింగ్‌ను సూచీలు ఉత్సాహంగా ప్రారంభించాయి. 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ ఒక దశలో 300 పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 11,100 మార్క్‌ పైన కదలాడింది. అయితే చివరి గంటల్లో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా లాభాల్లో చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. మొత్తంగా నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 52 పాయింట్ల స్వల్ప లాభంతో 37,402 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ అత్యల్పంగా 6 పాయింట్లు లాభపడి 11,054 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.45గా కొనసాగుతోంది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/