భారీగా పతనమైన స్టాక్‌ మార్కెట్లు

SENSEX DOWN
SENSEX DOWN

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ ఏకంగా 624 పాయింట్లు పతనమై 36,958 వద్ద, నిఫ్టీ 184 పాయింట్లు దిగజారి 10,926 వద్ద స్థిరపడ్డాయి. ముఖ్యంగా యస్‌బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు భారీగా విలువ కోల్పోయాయి. మరోపక్క హెవీవెయిట్‌ షేరు రిలయన్స్‌ 10శాతానికి పైగా లాభపడ్డా మార్కెట్‌ పతనాన్ని ఆపలేకపోయింది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/