సెన్సెక్స్‌, నిఫ్టీలు మరోసారి రికార్డు బ్రేక్‌!

sensex
sensex

ముంబయి: మార్కెట్లు సరికొత్త గరిష్టాలను నమోదు చేసాయి. ప్రైవేటు బ్యాంకులు ర్యాలీ తీయడంలో ఆర్థికరంగానికి మంచి ఊతం ఇచ్చినట్లయింది. 40,469.78 పాయింట లవద్ద సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ముగించింది. ఎస్‌బ్యాంకు షేర్లలో ర్యాలీ తీసింది. మూడుశాతం వరకూ పెరిగింది. ఇక భారతి ఎయిర్‌టెల్‌ మాత్రం మూడుశాతం దిగజారింది. ఎన్‌ఎస్‌ఇలో నిఫ్టీ 50సూచీ కూడా 12వేల స్థాయిని చేరుకుంది. వివిధ విభాగాల వారీగా చూస్తే నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్‌సూచీ ఒకటిశాతం దిగజారింది. మధ్యాహ్నం డీల్స్‌లో కొంత మమందగమనం ఉన్నట్లు అంచనా. నిఫ్టీ రియాల్టీ సూచి రెండుశాతం పెరిగింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటనలతో కొంతమేర ర్యాలీతీసాయి. మార్కెట్లులో ఎస్‌అండ్‌పి బిఎస్‌ఇ మిడ్‌క్యాపక్షసూచీ కూడా 0.29శాతం పెరిగితే స్మాల్‌క్యాప్‌సూచీ 0.1శాతం క్షీనించింది. టైటాన్‌కంపెనీ 10శాతం దిగజారి 1160కి పడిపోయింది. ఉదయం పూట డీల్స్‌లో కంపెనీ త్రైమాసిక ఫలితాలే నిరాశపరిచినట్లు తేలింది. అంతేకాకుండా బంగారంధరలు పెరగడం, మొత్తంగా వినియోగంలో తగ్గడం కూడా ఇందుకు ఒక కారణం. రియాల్టీ స్టాక్స్‌ ఇబియాబుల్స్‌, శోభా, ప్రెస్టిజ్‌ ఎస్టేట్‌ సంస్థలు ఐదుశాతంవకూ పెరిగాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/