దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలు

Bombay Stock Exchange
Bombay Stock Exchange

ముంబయి: దేశీయ మార్కెట్లు దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజి నిఫ్టీ 9 పాయింట్లతో లాభపడి 11,905 వద్ద కొనసాగుతుంది. అలాగే బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజి సూచి సెన్సెక్స్‌ 26 పాయింట్ల లాభంతో 40,383 వద్ద ట్రేడవుతుంది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందాలలో పురోగతి కనిపిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్లు సైతం పెరిగాయి. కాగా రూపాయి మారకం డాలరుతో 71.80 వద్ద కొనసాగుతుంది. గెయిల్‌, ఎమ్‌అండ్‌ఎమ్‌, ఓఎన్‌జిసి యస్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగగా.., జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, గ్రాసిమ్‌, బిపిసిఎల్‌ షేర్లు మాత్రం లాభాల బాటలో పయనిస్తున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/