కాంగ్రెస్ పార్టీకి సునీల్ జకార్ రాజీనామా

సైకోపాత్ ల నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ రాహుల్ కు సూచన

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కి ఆ పార్టీకి సీనియర్ నేత, పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ రాజీనామా చేశారు. పోతూపోతూ రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపిస్తూనే వార్నింగ్ ఇచ్చారు. సైకోపాత్ లకు దూరంగా ఉండాలని రాహుల్ కు సూచించారు. ‘గుడ్ లక్ , గుడ్ బై కాంగ్రెస్’ అంటూ పార్టీకి వీడ్కోలు చెప్పారు. ఇవాళ ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఆయన తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు.

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో చింతన్ శిబిర్ జరుగుతున్న సమయంలోనే పార్టీ సీనియర్ నేత రాజీనామా చేయడం పార్టీకి పెద్ద షాక్. ఢిల్లీలో కూర్చున్న వాళ్లే పంజాబ్ లో పార్టీని అధోగతి పట్టించారన్నారు. ఎంపీ అంబికా సోని వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పంజాబ్ లో హిందూ ముఖ్యమంత్రిని పెడితే దు:ఖాన్ని కొని తెచ్చుకున్నట్టేనన్న ఆమె వ్యాఖ్యలు సరికాదన్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ వల్ల కూడా పార్టీ ఓడిపోయిందన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/