కేసీఆర్‌పై మోత్కుపల్లి ప్రశంసలు

అంబేద్కర్ కు నిజమైన వారసుడు కేసీఆరే : మోత్కుపల్లి నర్సింహులు

హైదరాబాద్ : సీనియర్ రాజకీయవేత్త మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ సీఎం కేసీఆర్ ను వేనోళ్ల కీర్తించారు. సీఎం కేసీఆర్ ను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తో పోల్చారు. దళిత బంధు వంటి పథకం ఎక్కడా లేదని, అంత సాహసం చేసింది సీఎం కేసీఆర్ ఒక్కరేనని, తద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అంబేద్కర్ లా సీఎం కేసీఆర్ కూడా చరిత్రలో నిలిచిపోతారని వెల్లడించారు. తన ఆలేరు నియోజకవర్గంలోని వాసాలమర్రిలో దళిత బంధు అమలు చేస్తుండడం ఎంతో ఆనందం కలిగిస్తోందని మోత్కుపల్లి చెప్పారు. ప్రజల కోసం బతికే నాయకుడు కేసీఆర్ అని అభివర్ణించారు.

దళిత బంధు పథకాన్ని ఎలా ఆపాలా అని చాలామంది చూస్తున్నారని, కుట్ర చేస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశంలో తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయగలవా? అని ప్రశ్నించారు. అన్ని పార్టీలు దళితులను దళితులుగా చూశాయే తప్ప, ఇలా దళితుల ఖాతాల్లో నేరుగా రూ.10 లక్షలు వేయడం ఎక్కడా చూడలేదని వివరించారు. అంబేద్కర్ కు నిజమైన వారసుడు కేసీఆరేనని పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/