సీనియర్ నేత చందూలాల్ మృతి

ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా , మంత్రిగా పలు సేవలు

Senior leader Chandulal -File
Senior leader Chandulal -File

Hyderabad: తెలంగాణ, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి , టీఆర్ఎస్ నేత అజ్మీరా చందూలాల్ (67) అనారోగ్యంతో మృతి చెందారు. ములుగు జిల్లా పరిధిలో ఉన్న జగ్గన్నపేటలో 1954 ఆగస్టు 17న జన్మించిన ఆయన, ఎంపీగా, ఎమ్మెల్యేగా పలుమార్లు విజయం సాధించారు. ఇటీవల కిడ్నీలు విఫలం కాగా వైద్యులు కొత్త కిడ్నీలను అమర్చారు. అప్పటి నుంచి డయాలసిస్‌పై ఆధారపడి, మరోమారు అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. గురువారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చందూలాల్ ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా ,. అనంతరం 1994లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2005లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ కోసం పోరాడారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించి నూతన తెలంగాణలో పర్యాటక, సాంస్కృతిక, గిరిజన శాఖల మంత్రిగా నిర్వహించారు. ఆయనకు భార్య శారద, కుమారుడు ప్రహ్లాద్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/