టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు?

అచ్చెన్నను నియమించాలంటూ అధినేతను కోరిన నేతలు

atchannaidu

అమరావతి: పార్టీ సీనియర్‌ నేత అచ్చెన్నాయుడిని టిడిపి ఏపి అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందంటూ పార్టీవర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏపి అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమించాలని పలువురు నేతలు అధినేత చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారని సమాచారం. మరో వారం, పది రోజుల్లోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సంస్థాగత ఎన్నికల ప్రక్రియను మండలస్థాయి వరకు పూర్తిచేసిన టిడిపి ఇప్పుడు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. మరో వారం రోజుల్లో ఈ కమిటీలను, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారని సమాచారం. అలాగే, రాష్ట్ర కమిటీల నియామకం కూడా పూర్తిచేస్తారని తెలుస్తోంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/