కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత

నేటి సాయంత్రం నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో హన్స్‌రాజ్ భరద్వాజ్ అంత్యక్రియలు

Senior Congress leader Hans Raj Bhardwaj
Senior Congress leader Hans Raj Bhardwaj

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి హన్స్‌రాజ్‌ భరద్వాజ్‌ (83) ఢిల్లీలో గుండెపోటుతో కన్నుమూశారు. హన్స్‌రాజ్‌కు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హన్స్‌రాజ్ మరణవార్తతో కాంగ్రెస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. గతంలో ఆయన కర్ణాటకకు గవర్నర్ గా కూడా పనిచేశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గత బుధవారం సాకేత్‌లో మాక్స్ ఆసుపత్రిలో చేరారు. నేటి సాయంత్రం నాలుగు గంటలకు నిగమ్‌బోధ్ ఘాట్‌లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుమారుడు అరుణ్ భరద్వాజ్ తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/