ప్రముఖ సీనియర్ నటుడు మ‌న్న‌వ బాల‌య్య క‌న్నుమూత‌

హైదరాబాద్: ప్రముఖ సీనియర్ నటుడు బాలయ్య(94) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి… ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో.. మరణించారు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపట్ల పలువురు సినీరాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కెరీర్​లో నటుడిగా నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు బాలయ్య. పుట్టినరోజు నాడే చనిపోవటం బాధాకరమైన విషయం. గుంటూరు జిల్లా వైకుంఠపురం(అమరావతి) శివారు గ్రామం చావపాడులో గురవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు ఏప్రిల్ 9, 1930లో జన్మించారు బాలయ్య. మెకానికల్ ఇంజినీరింగులో బి.ఇ 1952లో పూర్తి చేశారు. 1957 వరకు మద్రాసు, కాకినాడ పాలిటెక్నిక్‌లలో లెక్చరర్‌గా పనిచేశారు.

కాగా, 300కి పైగా చిత్రాల్లో నటించిన మన్నవ బాలయ్య.. యమలీల, అన్నమయ్య, పెళ్లిసందడి, మల్లీశ్వరి, శ్రీరామరాజ్యం లాంటి సినిమాల్లో బాలయ్య నటించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/