సెల్ఫ్‌ మోటివేషన్‌ నైపుణ్యం

ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు ఒకప్పుడు మాన్యు ఫాక్చరింగ్‌ రంగం స్వర్గధామం. ప్రస్తుతం ఈ రంగం స్తబ్దుగా ఉంది.పెరిగిన సరఫరాను ఇముడ్చుకోలేని పరిస్థితుల్లో ఉంది. తరువాత కాలంలో ఇన్ఫర్మేషన్‌తో డిమాండ్‌ అంతగా ఉండటంలేదు. దీంతో ఉద్యోగిత నైపుణ్యాలు బలంగా ఉన్న ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు మాత్రమే ఐటిలోనైనా, మాన్యుఫాక్చరింగ్‌లోనైనా అవకాశాలు దక్కుతున్నాయి.

Self Motivation Skill
Self Motivation Skills

ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్‌ కోర్సు కరికులమ్‌లో మార్పులు చోటుచేసుకోవటం లేదు. అసోచామ్‌ స్టడిప్రకారం హ్యుమానిటీస్‌లో ప్రతి పదిమందిలో ఒకరు ఇంజినీరింగ్‌లో ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే ఉద్యోగానికి అర్హత పొందుతున్నారు. మరో నివేదిక ప్రకారం బిస్కూల్‌ క్యాంపస్‌ ఇంటర్వ్యులు కూడా ఏమంత ఆశాజనకంగా లేవు. ప్రతి అయిదుగురిలో ఒకరే జాబ్‌ పొందగలిగారు. ఆయా సంస్థల్లో బోధిస్తున్న టీచర్లలో ఇరవై శాతం మంది నేషనల్‌ కౌన్సిల్‌ పర్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ నిర్దేశించే ప్రమాణాలకు అనుగుణంగా లేరు.

ఈ నేపథ్యంలో ఉద్యోగిత నైపుణ్యాలు అంటే ఏవి, వాటిని ఎలా పొందాలి అన్నది ప్రధాన ప్రశ్నగా ఉంది. రిక్రూటర్ల విషయానికి వస్తే అభ్యర్ది అలాగే జాబ్‌ ప్రొఫైళ్ళను సరి చూస్తారు. జాబ్‌ పొందాలంటే చదువుకు తగ్గవిధంగా హార్డ్‌ లేదంటే అన్వయ నైపుణ్యాలను ఇంజినీరింగ్‌ విద్యార్ధి సముపార్జించాలి. కమ్యూని కేషన్‌, ఇంట్రా పర్సనల్‌ రిలేషన్స్‌, ప్రాబ్లెమ్‌-సాల్వింగ్‌, డెసిషన్‌ మేకింగ్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌, సెల్ఫ్‌ మోటివేషన్‌ నైపుణ్యాలను తదునుగుణ్యమైన టెక్నికల్‌ స్కిల్స్‌ను విద్యార్జనలో భాగంగానే అలవర్చుకోవాలి.

ఉదాహరణకు మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్‌ చేసిన ఎంబిఎ విద్యార్దిగా పైన పేర్కొన్న నైపుణ్యాలనువృత్తిలో విజయానికి తప్పనిసరిగా నేర్చుకోవాలి. అదే విధంగా ఒక డాక్టర్‌కు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు తోడు బాగా వినే స్వభావం కలిగి ఉండాలి. కాన్ఫిడెన్స్‌ బిల్డింగ్‌,మోటివేషన్‌ స్కిల్స్‌ కూడా అవసరం ఇంజినీర్‌గా నిలదొక్కుకోవాలంటే ప్రాబ్లెమ్‌ సాల్వింగ్‌, డెసిషన్‌ మేకింగ్‌, ఇంట్రా పర్సనల్‌ స్కిల్స్‌్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌, న్యూమ రికల్‌ స్కిల్స్‌ ఉండాలి.
ఉద్యోగానికి అవసరమైన విధంగా సన్నద్ధతకు నాలుగు సాధారణ సాప్ట్‌ స్కిల్స్‌ చాలా అవసరం. అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక రూపొందించుకోగలగాలి. అలాగే నిర్దేశితగడువు లోపేప్రణాళికను సమగ్రంగా అమలు చేయాలి. చక్కగా వినడం, తగు విధంగా మాట్లాడటం, రాయడం, ప్రజంటేషన్‌ నైపుణ్యాలు, ఇంట్రాపర్సనల్‌ స్కిల్స్‌ను అభి వృద్ధిపర్చుకోవాలి. ఇతరుల కోణంలో ఆలోచించి చూడగలిగే సామర్ధ్యం కూడా ఉండాలి.

కామన్‌ విజన్‌ను రూపొందించగలగాలి. వివిధ పనులు సక్రమంగా జరిగేందుకు చొరవ చూపాలి. పని చేసేలా తగుమేర ఒత్తిడి చేయడం. మోటివేషన్‌, ఇతరులకు తోడ్పాటు అందించడం వంటివన్నీ నాయకత్వానికి అవసరం. ఏ నైపుణ్యమైనా సరే కోచింగ్‌లో చేరితే కెరీర్‌కు అనుగుణంగా అల వర్చుకోవచ్చు. విదేశాల్లో చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్న అదనంగా ఒక భాషపై పట్టు చాలా అవసరం. చదువుతున్న రోజుల్లో నే కాలేజీలో జరిగే వివిధ కార్యకలాపాలు అంటే సెమినార్లు డిబేట్లు, కేస్‌స్టడీస్‌, మాక్‌ పార్ల మెంట్‌, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలి.

తద్వారా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పెంపొందించుకోవచ్చు.మీ నైపుణ్యాలు, ఆప్టిట్యూడ్‌ తదితరాలు కలలుకనే జాబ్‌కు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది తెలుసుకునేందుకు మెంటార్‌తో ఒకసారి సంప్రదింపులు జరపడం మంచిది. కరెంట్‌ ట్రెండ్స్‌, మెయిన్‌ స్ట్రీమ్‌లో ఉండే లాంగ్‌టెర్మ్‌ అవకాశాలు, ఆఫ్‌బీట్‌ కెరీర్స్‌పై మక్కువ చూపే ముందు విద్యార్ధులు సంబంధిత అన్ని అంశాలపై సునిశితంగా, తార్కి కంగా విశ్లేషించుకోవాలి. అవసరమైన సాఫ్ట్‌స్కిల్స్‌ విషయంలో రక్షణరేఖకు పై భాగం లోనేఉంటే మంచిఅవకాశాలను అందుకోవచ్చు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/