స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష

‘నవమి’ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు

Hyderabad: స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష  అని  మంత్రి హరీష్ రావు అన్నారు.  శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముడు కష్టాల్లో మనో నిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగి విజయం సాధించారని అన్నారు.

శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకొని విశ్వాన్ని వినాశనం చేసేలా దాపురించిన మహమ్మారి కరోనాని మనో ధైర్యం తో తరిమికొడదామని పిలుపు నిచ్చారు.

కరోనా వైరస్ నేపథ్యంలో శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని , ఆరుబయట కాకుండా ఆలయాల్లో కేవలం అర్చకుల సమక్షంలోనే శ్రీ సీతారామ కల్యాణం చేయాలన్నారు..

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/