అర్జున అవార్డుకు సందేష్‌ జింగాన్‌, బాలా దేవి ఎంపిక

2019 ఎఐఎఫ్‌ఎఫ్‌ ఆసియా కప్‌లో సందేష్‌ జింగాన్‌ అనూహ్యప్రతిభ

అర్జున అవార్డుకు సందేష్‌ జింగాన్‌, బాలా దేవి ఎంపిక
Sandesh Jhingan

ఆల్‌ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ అర్జున అవార్డుకు నామినేషన్లుగా జాతీయ జట్టు సెంట్రల్‌ డిఫెండర్‌ సందేష్‌ జింగాన్‌, మహిళల టీమ్‌ స్ట్రైకర్‌ ఎన్‌ బాలాదేవిలను ఎంపిక చేసింది.

ఇటీవలి కాలంలో వారి ప్రతిభకు ఫలితం లభించినట్టయింది.. ఈ ఏడాది క్రీడా పురస్కారాలకు నామినేషన్లుపంపాలని క్రీడామంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఎఐఎఫ్‌ఎఫ్‌ ఈ పేర్లను ఖరారు చేయటానికి పెద్దగా ఇబ్బంది పడలేదు..

అర్జున అవార్డు కోసం సందేశ్‌, బాలాదేవి పేర్లను పంపాలని నిర్ణయించినట్టు ఎఐఎఫ్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కుశాల దాస్‌ తెలిపారు..

26ఏళ్ల జింగాన్‌, ఎన్నో సంవత్సరాలుగా భారతజట్టులో అతిముఖ్యమైన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచాడని పేర్కొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/