వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన సెహ్వగ్‌

నేడు సచిన్‌ 47 వ పుట్టిన రోజు

sehwag, sachin
sehwag, sachin

హైదరాబాద్‌: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ నేటితో 47 వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్బంగా పలువురు సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజి ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వగ్‌ మాత్రం వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపాడు. ఇది నిజం ఒక గొప్ప వ్యక్తి బ్యాటింగ్‌ చేస్తూ భారత్‌లో సమయాన్ని ఆపగలిగే వాడు. అయితే సచిన్‌ కేరిర్‌లో అతిపెద్ద సూర్తి ఏదైనా ఉందంటే అది ఈ రెండు చిత్రాల్లోనే దాగి ఉంది. ప్రతి కష్టం వెనక ఓ విజయం ఉంటుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దీన్ని తప్పకుండా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. హ్యపి బర్త్‌డే సచిన్‌ అంటూ 2007,2011 ప్రపంచకప్‌ నాటి ఫోటోలను ట్విట్‌ చేశాడు.

తాజ అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/