జాతీయ జెండాను అవమానించిన అమిత్ షా కొడుకు ఫై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం

ఆసియా కప్‌ 2022 లో టీమిండియా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కొడుకు బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా హాజరయ్యారు. టీమిండియా విజయం సాధించిన అనంతరం.. చప్పట్లు కొడుతున్న జై షాకు.. ఆయన పక్కనే ఉన్న ఒక వ్యక్తి.. జాతీయ జెండాను పట్టుకోమ్మని ఇస్తే..జై షాకు మాత్రం.. జాతీయ జెండాను పక్కకు నెట్టేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారడంతో జై షా..ఫై విమర్శలు కురిపిస్తున్నారు.

తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క నిన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా కుమారుడు జై షా వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ హైలైట్స్ అంటూ పేర్కొన్న ఎమ్మెల్యే సీతక్క అమిత్ షా కుమారుడు జై షా భారతదేశ జాతీయ జెండాను తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రివర్ణ పతాకంతో ఎందుకు అమిత్ షా కొడుకు జై షా ఇండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకోవడం లేదో చెప్పాలని ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. భారతదేశ జాతీయ జెండా అంటే ఆయనకి ఏమైనా ఎలర్జీ ఉందా? అంటూ ఎమ్మెల్యే సీతక్క నిప్పులు చెరిగారు.