‘సీత’ టీజర్‌ విడుదల

Seeta Movie Teaser Launch
Seeta Movie Teaser Launch

యువకథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ , డైరెక్టర్‌ తేజ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం సీత.. కాజల్‌ అగర్వాల్‌, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు.. ప్రపంచ వ్యాప్తంగా ఈచిత్రాన్ని ఏప్రిల్‌ 25న విడుదల చేయబోతున్నారు.. విజయవాడలోని విఆర్‌ సిద్ధార్ధ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఈచిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈవేడుకలో 5వేలమంది విద్యార్థులు పాల్గొనటం విశేషం.. ఈ వేడుకలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ స్టన్నింగ్‌ డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌, అనూప్‌ రూబెన్స్‌ పెర్ఫామెన్స్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి.. వేడుకలో తేజ, అనీల్‌ సుంకర, కిషోర్‌ గరికపాటి, పాయల్‌ రాజ్‌పుత్‌,అనూప్‌రూబెన్స్‌ తదితరులుపాల్గొన్నారు.. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.. యూనిట్‌ సభ్యులందరూ సీత సక్సెస్‌పై కాన్ఫిడెంట్‌తో ఉన్నారు.