చంద్రబాబుకు ,లోకేశ్‌కు భద్రత తగ్గింపు

lokesh ,chandra babu naidu
lokesh ,chandra babu naidu


హైదరాబాద్‌: మాజీ సియం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని మంగళవారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు.. మరో వైపు చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఏపి ప్రభుత్తం భద్రత తగ్గించింది. జెడ్‌ కేటగిరి ఉన్న మాజీ మంత్రి నారా లోకేశ్‌కు భద్రత తగ్గించి 2+2 గన్‌మెన్లను కేటాయించారు. మిగిలిన కుటుంబ సభ్యులకు పూర్తిగా భద్రత తొలగించారు. కనీస సమాచారం లేకుండా చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత తగ్గింపుపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/