సరిహద్దుల్లో భద్రత మరింత కట్టుదిట్టం

సరిహద్దుల్లో భద్రత మరింత కట్టుదిట్టం


న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్ర దాడి అనంతరం పాకిస్థాన్‌ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడులు జరిపిన నేపథ్యంలో పాక్‌ సరిహద్దుల్లో రాత్రివేళ పౌరుల రాకపోకలపై భారత సైన్యం నిషేధం విధించింది. సరిహద్దుల్లో 5 కి.మీ. పరిధిలో పౌరులు సంచరించవద్దని సైనికులు కోరారు. ఏప్రిల్‌ మొదటి వారం వరకు ఐదు కిలోమీటర్ల పరిధిలో రాత్రి 6 నుంచి ఉదయం 7 గంటలవరకు పౌరులు రాకపోకలు సాగించకుండా నిషేధం విధించారు. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సియం పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. వచ్చే మూడు రోజులపాటు పాక్‌ సరిహద్దుల్లో బిఎస్‌ఎఫ్‌ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని కేంద్రం ఆదేశించింది.