దేశంలో 13 ఎయిర్‌పోర్టులకు భద్రత పెంపు

airport
airport

హైదరాబాద్‌: జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం భారత పౌరవిమానయానమంత్రిత్వశాఖ దేశంలోని అన్ని కీలక ఎయిర్‌పోర్టుల్లో భద్రతను పెంచింది. మొత్తం దేశంలోని 13 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భద్రతను పటిష్టంచేసింది. వీటితోపాటే హైపర్‌సెన్సిటివ్‌గా ఉన్న హైదరాబాద్‌రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికిసైతం బందోబస్తును రెట్టింపుచేసింది. సిఐఎస్‌ఎఫ్‌ కేంద్రకార్యాలయంనుంచి ఈమేరకు ఉత్తర్వులు అందాయి. దేశంలో మొత్తం విమానాశ్రయాలు 100కుపైగా ఉన్నాయి. సిఐఎస్‌ఎఫ్‌ వీటిలో60 విమానాశ్రయాలకు రక్షణ కవచం అందిస్తోంది రాజీవ్‌గాంధీ విమానాశ్రయం, కన్నూరు ఎయిర్‌పోర్టులను ఇటీవలే సిఐఎస్‌ఎఫ్‌ కవర్‌కిందకు తెచ్చింది. నిరంతరం లోపలా, బయటా తనిఖీలునిర్వహిస్తూ గస్తీ తిరుగుతారు. సిఐఎస్‌ఎఫ్‌ అదనపు సిబ్బందిని సైతం నియమించింది. పుల్వామాజిల్లాలోని అవంతిపురలో 40 మంది సిఆర్‌పిఎఫ్‌జవాన్లను ఆత్మాహుతిదాడితో బలిచేసిన అనంతరం అన్ని వైపులా కీలకంగా ఉన్న భారత్‌ వ్యవస్థలకు రక్షణకవచం పటిష్టంచేసారు. ఇందులోభాగంగాముందు ఎయిర్‌పోర్టుల్లో భద్రతను మరింత కట్టుదిట్టంచేసారు. ఇంటిలిజెన్స్‌, సర్విలెన్స్‌ విబాగాల సిబ్బంది మామూలు దుస్తుల్లోనే జనం మధ్యకువచ్చి ప్రతి ఒక్కరి కదలికలను పర్యవేక్షిస్తారు. ప్రయాణీకులతోపాటే వారుకూడా లోపల తచ్చాడుతూ నిఘా వ్యవస్థను మరింత పటిష్టంగా కొనసాగిస్తారు. సిఐఎస్‌ఎఫ్‌ కేంద్ర కార్యాలయంనుంచి కొన్ని నిర్దిష్టమైన విధానాలు రూపొందించి పాటించాలని ఆదేశించింది. కంట్రోల్‌పాయింట్స్‌, ప్రయాణీకులను తనిఖీ విధానం, అంతర్గత సెక్యూరిటీ, ముందస్తుప్రత్యేక నిఘా వ్యవస్థలను మరింతగాపెంచింది. హైపర్‌సెన్సిటివ్‌కేటగిరీలో ఉన్న ఎయిర్‌పోర్టులకు ఈ భద్రతను మరింతపెంచింది.