సెక్యూరిటీ బలగాల దాడులు ..18మంది ఐఎస్‌ ఉగ్రవాదులు హతం

Security forces raid
Security forces raid

బగ్దాద్‌: ఇరాక్‌ దేశంలో ఇరాకీ భద్రతా దళాలు అమెరికా సంకీర్ణ సేనలతో కలిసి దాడులు జరిపారు. ఈ దాడుల్లో 18 మంది ఐఎస్‌ ఉగ్రవాదులు మృతిచెందారు. అయితే ఇరాక్ దేశంలోని అన్‌బర్, నిన్వేహ్ ప్రాంతాల్లో రెండు వేర్వేరు దాడుల ఘటనలో 18 మంది ఉగ్రవాదులు మరణించారని ఇరాక్ మిలటరీ ప్రకటించిందిసిరియా దేశ సరిహద్దుల్లోని స్నేస్ లాహ్ సరస్సు వద్ద ఐఎస్ ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర అమెరికా సంకీర్ణ సైనికులు వైమానిక దాడులు జరిపారు. ఈ దాడిలో ఉగ్రవాదుల వాహనాన్ని పేల్చివేశారు. సిరియా సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర యుద్ధ విమానాలు దాడి చేయగా, ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ఐఎస్ ఉగ్రవాదుల వాహనాలను ఆర్మీ ధ్వంసం చేసింది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/