ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భద్రత పెంపు

తనకు ఎవరి వల్ల హాని ఉందో చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్

rajasingh
rajasingh

హైదరాబాద్‌: తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. ఇటీవల అరెస్ట్ అయిన ఉగ్రవాదుల హిట్‌లిస్టులో రాజాసింగ్ పేరు ఉన్నట్టు నిఘావర్గాల నుంచి అందిన సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎమ్మెల్యే ఇంటి వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. డీసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో రాజాసింగ్ భద్రతను పర్యవేక్షించనున్నారు. ప్రభుత్వం సమకూర్చిన బుల్లెట్ ప్రూఫ్ కారులోనే వెళ్లాలని, ద్విచక్ర వాహనంపై తిరగవద్దని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ కోరారు. మరోవైపు, తనకు భద్రతను పెంచడంపై రాజాసింగ్ స్పందించారు. తనకు ఎవరి నుంచి ముప్పు ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు భద్రత పెంపు విషయమై కేంద్ర, రాష్ట్ర హోంశాఖలకు లేఖ రాస్తానని పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/