రేవంత్‌రెడ్డికి భద్రత పెంపు

revanth reddy
revanth reddy


హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు పెంచారు. ఆయన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో రేవంత్‌రెడ్డి తనపై కొందరు కుట్ర పన్నుతున్నారని, కొందరి నుంచి ప్రాణభయం ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. ఐతే ఎన్నికల సమయంలో మరింత భద్రత అవసరం అని భావించిన అదనపు డిజిపి జితేందర్‌ తెలిపారు. అందుకే రేవంత్‌ రెడ్డికి పోలీసు భద్రత పెంచామని తెలిపారు. ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు.