సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నిర్వహణ బాద్యతలు ప్రైవేటుకు!

Secunderabad Railway Station
Secunderabad Railway Station

హైదరాబాద్‌: ఇప్పటివరకు రైల్వేస్టేషన్ల నిర్వహణ పూర్తిగా రైల్వేశాఖ చేతిలో ఉన్న ప్లాట్‌ఫాం టికెట్ల విక్రయాలు, పారిశుద్ధ్యంతోపాటు పార్కింగ్‌ వంటి సేవలను గుర్తించిన స్టేషన్లలో ప్రైవేటుకు అప్పగించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో సికింద్రాబాద్‌ స్టేషన్‌ను ఇండియన్‌ రైల్వే స్టేషన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎస్‌డీసీ)కి అప్పగించింది. అయితే ఈ పరిణామంపై రైల్వే కార్మికసంఘాల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఆదాయం పెంచుకోవడానికి ప్రైవేటు సంస్థలను అనుమతించడం ద్వారా ఉద్యోగాలు తగ్గిపోవడంతోపాటు ప్రయాణికులపై భారం పడే ప్రమాదం ఉందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/