ఇండియా గేట్ వద్ద 144 సెక్ష‌న్‌

హథ్రాస్‌ ఘటనపై  కాంగ్రెస్ నిరసన

ఇండియా గేట్ వద్ద 144 సెక్ష‌న్‌
India Gate

న్యూఢిల్లీ: యూపీ హథ్రాస్‌ జిల్లాలో సామూహిక హత్యాచార ఘటనపై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇందులో భాగంగా ప‌లు పార్టీలు నేడు దేశ రాజ‌ధానిలో ధ‌ర్నాల‌కు పిలుపునిచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు ఇండియా గేట్ ప‌రిస‌ర ప్రాంతాల్లో 114 సెక్ష‌న్ విధించారు. 144 సెక్షన్ విధిస్తూ ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ ఎలాంటి నిర‌స‌న‌ల‌కైనా అనుమ‌తులు ఉంటే ఇండియా గేట్‌కు 3 కి.మీ. దూరంలోని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద నిర్వ‌హించుకోవాల‌ని, వంద మందికంటే ఎక్కువ మంది గుమికూడ‌డానికి వీళ్లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇండియాగేట్ ప‌రిస‌రాల్లో ఎట్టిప‌రిస్థితుల్లో గుమికూడ కూడ‌ద‌ని, అలాంటి వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. నిషేదాజ్ఞ‌లు రేప‌టి వ‌ర‌కు అమ‌ల్లో ఉంటాయ‌ని వెల్ల‌డించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/