ఝున్‌ఝున్‌వాలాకు సెబీ నోటీసులు

ఆప్‌టెక్‌ షేర్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు

Rakesh Jhunjhunwala
Rakesh Jhunjhunwala

ముంబయి: ఆప్‌టెక్‌ షేర్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్న ఆరోపణలపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ దిగ్గజ మదుపరి రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలాకు నోటీసులు జారీచేసింది. ఆప్‌టెక్‌లో రాకేష్‌, ఆయన కుటుంబ సభ్యులకు మోజారిటీ వాటా ఉంది. ఆప్‌టెక్‌ వాటాదార్లుగా ఉన్న ఇతర కుటుంబ సభ్యులు, మదుపరి రమేష్‌ దమానీ, డైరెక్టర్‌ మధు జయకుమార్‌ సహా కొంత మంది బోర్డు సభ్యుల పాత్రపై సెబీ విచారిస్తోంది. ముంబయిలోని సెబీ ప్రధాన కార్యలయంలో లాయర్లతో పాటు హాజరైన ఝున్‌ఝున్‌వాలాను అధికారులు రెండు గంటల పాటు విచారించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల తరపున తాను హాజరైనట్లు విచారణాధికారికి ఝున్‌ఝున్‌వాలా వెల్లడించారు. ఝున్‌ఝున్‌వాలా సోదరి సుధా గుప్తాను కూడా విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు పంపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/