చైర్మన్‌, డైరెక్టర్లపై సెబీ నిషేధం

రీసర్జర్‌ మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ ఇండియా సంస్థపై సెబీ మూడేళ్ల నిషేధం

Securities and Exchange Board of India
Securities and Exchange Board of India

న్యూఢిల్లీ: జీడీఆర్‌ ఇష్యూ విషయంలో అక్రమాలకు పాల్పడిన రీసర్జర్‌ మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ ఇండియా సంస్థ చైర్మన్, ఎండీ సుభాష్‌ శర్మ, హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ అమిత్‌ శర్మ, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇండిపెంటెండ్‌ డైరెక్టర్‌ నితిత్‌సేథిలను సెక్యూరిటీస్‌ మార్కెట్లలోకి ప్రవేశించకుండా సెబీ మూడేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ కంపెనీ 2010లో 5.21 మిలియన్‌ డాలర్ల జీడీఆర్‌లను జారీ చేయడం ద్వారా 53.75 మిలియన్‌ డాలర్లను సమీకరించింది. ఈ జీడీఆర్‌లు అన్నింటినీ వింటేజ్‌ ఎఫ్‌జెడ్‌ఈ అనే ఒకే సంస్థ యూరోపియన్‌ అమెరికన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌బ్యాంకు ఏజీ నుంచి రుణం పొందడం ద్వారా సబ్‌స్క్రయిబ్‌ చేసుకున్నట్టు సెబీ గుర్తించింది. వింటేజ్‌ సంస్థ తీసుకున్న రుణాలకు రీసర్జర్‌ గ్యారంటీ ఇచ్చినట్టు తేలింది. ఈ విధమైన అవగాహన ద్వారా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి జీడీఆర్‌కు మంచి స్పందన వచ్చిందంటూ దేశీయ ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించడమేనని సెబీ పేర్కొంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/