మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులలో ముగిసిన సోదాలు

నిన్నటి నుండి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లపై IT, GST అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లలో వందల కోట్ల లావాదేవీలు ఎలా జరిగాయనే కోణంలో సోదాలు నిర్వహించారు.

ఈ మధ్య ఐటీ , సీబీఐ దాడులు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువయ్యాయి. సినీ , రాజకీయ , బిజినెస్ నేతల ఇళ్ల ఫై , ఆఫీస్ లపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లపై ఐటీ దాడులు కలకలం రేపాయి. ‘శ్రీమంతుడు’ చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. మొదటి మూవీ తోనే సూపర్ హిట్ కొట్టి భారీ లాభాలు అందుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్, రాంచరణ్, నాగచైతన్య, రవితేజ, అల్లు అర్జున్’ వంటి స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను రూపొందించింది.

ప్రస్తుతం చిరంజీవి తో ‘వాల్తేర్ వీరయ్య’, బాలకృష్ణ తో ‘ వీర సింహా రెడ్డి’ సినిమాలను నిర్మించారు. ఈ రెండు చిత్రాలను సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ కొత్త సినిమా చేయబోతున్నారు. దీనికి సంబదించిన పూజా కార్య క్రమాలు ఆదివారం జరిగాయి. ఇదిలా ఉంటె సోమవారం ఉదయం నుంచి సంస్థకు చెందిన ఆఫీసులతో పాటు ఇళ్లల్లో మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టింది. మంగళవారం ఉదయం వరకు సోదాలు నిర్వహించారు.

ఈ సోదాలలో కీలక పాత్రలతో పాటు హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. వరుస భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్… ఇవి రెగ్యులర్ గా జరిగే ఐటీ రైడ్సేనని చెప్తున్నారు. అయితే ఈ సోదాల్లో భారీ చిత్రాలకు నిర్మాణ వ్యయాన్ని ఏవిధంగా సమకూర్చుతున్నారానే దానిపై ఆరా తీసినట్టు సమాచారం. ఈ మేరకు సినిమాల ద్వారా వచ్చిన భారీ లాభాలపై పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలను ఐటీ అధికారులు పరిశీలించారు. చార్టర్డ్ అకౌంటెంట్స్, అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి చెందిన వాళ్లనే అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లతో పాటు… ఏపీ నుంచి వచ్చిన స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు హిట్ కొట్టిన సినిమాలకు పెట్టుబడులు, ఐటీ చెల్లింపులపై ఐటీ శాఖ వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది.