స్కాటిష్ ఓపెన్ గెలిచిన నాలుగో భారతీయుడు లక్ష్యసేన్

గ్లాస్గో: 18 ఏళ్ల భారత యువ షట్లర్ లక్ష్యసేన్ తనదైన ఆటతీరుతో చెలరేగుతున్నాడు. సీనియర్ ఆటగాళ్ల కన్నా మెరుగ్గా తన ఆట తీరును ప్రదర్శించి ఆకట్టుకుంటున్నారు. రసవత్తరంగా సాగిన ఫైనల్లో వైగర్ కోహెలో పై విజయం సాధించి స్కాటిష్ ఓపెన్‌ను కైవసం చేసుకున్నారు. సెప్టెంబర్ నుంచి నాలుగు టోర్నీల్లో ఆడిన ఈ యువ షట్లర్ సార్లర్ లక్స్ ఓపెన్, బెల్జియం ఇంటర్నేషనల్, డచ్ ఓపెన్ గెలిచారు. ఐరిష్ ఓపెన్ రెండో రౌండ్లో పరాజయాన్ని చవిచూసిన తర్వాత తన ఆట తీరులో మార్పులు చేసుకున్నారు లక్ష్యసేన్. తన మిత్రుడు కోహెలోతో డెన్మార్క్ ఓపెన్‌లో కలిసి సాధన చేశానని, ఇప్పుడు ఏకంగా తనపై విజయం సాధించటం ఆనందంగా ఉందని యువ షట్లర్ పేర్కొన్నారు. ప్రస్తుతం 41వ ర్యాంకులో ఉన్న ఇతడు ఈ విజయంతో టాప్ 40 లో నిలుస్తారు. కాగా పుల్లెల గోపిచంద్, ఆనంద్ పవార్, అరవింద్ భట్ తర్వాత స్కాటిష్ ఓపెన్ గెలిచిన నాలుగవ భారతీయుడిగా లక్ష్యసేన్ నిలిచారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/