సెప్టెంబరు 5న పాఠశాలల పునఃప్రారంభం

ప్రైమరీ స్కూళ్ల అకడమిక్‌ క్యాలెండర్‌ రెడీ

Schools reopens on September 5th in AP
Schools reopens on September 5th in AP

Amaravati: 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రాథమిక పాఠశాలల అకడమిక్‌ క్యాలెండర్‌ సిద్ధమైంది.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబరు 5న పాఠశాలలు తెరుచుకునే పక్షంలో అందుకు సన్నాహకంగా ఈ క్యాలెండర్‌ రూపొందించారు.

కరోనా పరిస్థితిని అంచనా వేసి మరో వారం, పది రోజుల్లో అకడమిక్‌ క్యాలెండర్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటిస్తుంది.

సన్నాహక క్యాలెండర్‌ ప్రకారం … వచ్చే నెల 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభిస్తారు.

సెప్టెంబరులో 21 రోజులు, అక్టోబరులో 21 రోజులు, నవంబరులో 24 రోజులు, డిసెంబరులో 25/22 రోజులు, జనవరిలో 20/23 రోజులు, ఫిబ్రవరిలో 23 రోజులు, మార్చిలో 25 రోజులు, ఏప్రిల్‌లో 21 రోజులు పాఠశాలలు పనిచేస్తాయి.

మొత్తం మీద 2022-21లో 181 పనిదినాలు ఉంటాయి.

పరీక్షల ప్రణాళిక:

నిర్మాణాత్మక మూల్యాంకనం-1 పరీక్షలు అక్టోబరులో, సంగ్రహణాత్మక మూల్యాంకనం-1 పరీక్షలు జనవరిలో, నిర్మాణాత్మక మూల్యాంకనం-2 పరీక్షలు మార్చిలో, సంగ్రహణాత్మక మూల్యాంకనం-2 పరీక్షలు ఏప్రిల్‌లో జరుగుతాయి.

సెలవుల ప్రణాళిక:

దసరా సెలవులు- 2.10.2020- 26.10.2020

క్రిస్టమస్‌ సెలవులు – 24.12.2020-28.12.2020

సంక్రాంతి సెలవులు- 12.01.2021- 17.01.2021

వేసవి సెలవులు- 24.04.2021-11.06.2021

కాలనిర్ణయ పట్టిక:

1 నుంచి 5 తరగతులకు మొదటి పీరియడ్‌ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు మొత్తం 8 పీరియడ్‌లు ఉంటాయి.

కాగా, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ క్లాస్‌-3, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ క్లాస్‌-4, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ క్లాస్‌-5లలో మూడేసి పాఠాలను తొలగించారు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/