తెలంగాణలో వేసవి సెలవులు పొడిగింపు

మండుతున్న ఎండలే కారణం

school children
school children

హైదరాబాద్‌: తెలంగాణలో వేసవి సెలవులను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాలలకు సెలవులను జూన్‌ 11 వరకు పొడిగించాలని సియం కేసిఆర్‌ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో సెలవులను 11 వ తేదీ వరకు పొడిగిస్తూ విద్యాశాఖ కార్యదర్శి జనార్ధనరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవంగా వచ్చే నెల పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా వేసవి తాపం ఎక్కువగా ఉండడంతో వచ్చేనెల 12న పాఠశాలలను పున: ప్రారంభించాలని పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి , యూటిఎఫ్‌ ప్రధాన కార్యదర్శి చావా రవి వ్యక్తం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/