పుణెలో 23 నుండి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం

Schools in Pune set to reopen

ముంబయి: కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు, కాలేజీలు మూతపడిన విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్రలోని పుణె జిల్లాలో సోమ‌వారం నుంచి పాఠశాలలు, జూనియ‌ర్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. క‌రోనా ప‌రిస్థితుల‌కు అనుగుణంగా పాఠ‌శాల‌లు, కాలేజీల పునఃప్రారంభంపై ఆయా ప్రాంతాల అధికారులే అధికారులే నిర్ణ‌యం తీసుకుంటార‌ని రాష్ట్ర పాఠ‌శాల విద్యాశాఖ మంత్రి వ‌ర్షా గైక్వాడ్ వెల్ల‌డించారు. దీంతో పుణే జిల్లా అధికారులు న‌వంబ‌ర్ 23 నుంచి స్కూళ్ల‌లో 9, 10 త‌ర‌గ‌తులు, జూనియ‌ర్‌ కాలేజీల్లో విద్యార్థుల‌కు త‌ర‌గతులు ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు. అయితే క‌రోనా నిబంధ‌న‌లను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని ఆయా యాజ‌మాన్యాల‌కు స్ప‌ష్టం చేశారు.

స్కూళ్ల‌లో థ‌ర్మ‌ల్ స్కీనింగ్ చేస్తామ‌ని, ప‌ల్స్ ఆక్సీమీట‌ర్లు, హ్యాండ్ వాష్ అందుబాటులో ఉంచుతామ‌ని‌, పాఠశాల ఆవార‌ణ‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శాన‌టైజ్ చేస్తామ‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. అదేవిధంగా బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బందికి త‌ప్ప‌నిస‌రిగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. ఒక్కో బెంచీకి ఒక్క విద్యార్థిని మాత్ర‌మే కూర్చోబెట్టాల‌న్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/