కాశ్మీర్‌లో యథావిధిగా పని చేస్తున్న స్కూళ్లు, ఆసుపత్రులు

హోంశాఖ నివేదిక

students
students

న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌లో స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు యథావిధిగా పని చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ పేర్కొంది. జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 అనంతర పరిస్థితిపై హోంశాఖ ఒక నివేదిక రూపొందించింది. కేంద్రం, జమ్ము కాశ్మీర్‌ తరఫున సుప్రీంకోర్టుకు హాజరైన అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కాశ్మీర్‌ పరిస్థితిపై ధర్మాసనానికి వివరించారు. ప్రజా రవాణా వ్యవస్థ ప్రశాంతంగా పని చేస్తోందని, కొత్తగా తమకు సంక్రమించిన హక్కులతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వారు కోర్టుకు తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దు చేసిననాటనుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో విధించిన పరిమితుల కారణంగా ఒక్క వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోలేదని వారన్నారు. ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ చేసిన ఆరోపణలను వారు కొట్టివేశారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/