ఏపి ఈఎస్ఐలో భారీ స్కామ్‌

ESI
ESI

అమరావతి: ఏపి ఈఎస్ఐలో భారీ కుంభకోణం వెలుగచూసింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ స్కామ్‌ను బయటపెట్టింది. గత 6ఏళ్లలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని నిర్ధారణ అయ్యింది. లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు చేసి ఈ తతంగానికి పాల్పడ్డారు. రూ.51 కోట్లు ఈఎస్‌ఐ డైరెక్టర్లు చెల్లించారు. ఈఎస్‌ఐ డైరెక్టర్లు రవికుమార్‌, రమేష్‌, విజయ బాధ్యులుగా గుర్తించారు. మందులు, పరికరాలను వాస్తవ ధరకంటే 136 శాతం అధికంగా టెండర్లలో సంస్థలు చూపించాయి. లెజెండ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఓమ్మిమేడి ఎన్వెంటర్‌ ఫెర్ఫామెన్స్‌ సంస్థలకు అక్రమంగా 85 కోట్ల రూపాయిలను డైరెక్టర్లు చెల్లించారు. ఆ ఈఎస్‌ఐ డైరెక్టర్లకు ఆరుగురు జాయింట్‌ డైరెక్టర్లు సహకరించారని తేలింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/