సుప్రీంకోర్టులో సైరస్‌ మిస్త్రీకి ఎదురుదెబ్బ

టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ పునర్నియామకంపై సుప్రీంకోర్టు స్టే

Cyrus Mistry
Cyrus Mistry

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ పునర్నియామకంపై సుప్రీంకోర్టు స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మిస్త్రీకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సైరస్‌ మిస్త్రీని తిరిగి టాటా సన్స్‌ ఛైర్మన్‌గా నియమించాలంటూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) డిసెంబర్‌ 18న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తీర్పును సవాలు చేస్తూ టాటా సన్స్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ బీఆర్‌ గవా§్‌ు, జస్టిస్‌ సూర్య కాంత్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మిస్త్రీ పునర్నియామకంపై స్టే ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/