ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే

supreme court
supreme court

న్యూఢిల్లీ: టాటా సన్స్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తిరిగి నియమించాలంటూ ఇచ్చిన తీర్పులో కొన్ని సవరణలు చేయాలని ఎన్‌సీఎల్‌ఏటీని ఆర్‌ఓసీ అభ్యర్థించిన విషయం తెలిసిందే. దీనికి ఎన్‌సీఎల్‌ఏటీ నిరాకరించడంతో ఆర్‌ఓసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆర్‌ఓసీ విజ్ఞప్తిని ఎన్‌సీఎల్‌ఏటీ తిరస్కరిస్తూ ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది. మిస్త్రీ పునర్నియామకాన్ని సవాల్‌ చేస్తూ టాటా సన్స్‌ వేసిన పిటిషన్‌తో పాటు విచారిస్తామని తెలిపింది. కాగా టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ పునర్నియామకాన్ని నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు జనవరి 10న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మిస్త్రీకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సైరస్‌ మిస్త్రీని తిరిగి టాటా సన్స్‌ ఛైర్మన్‌గానియమించాలంటూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) డిసెంబరు 18న తీర్పు ఇచ్చింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/