కేంద్రం పై సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహం

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పులంటే గౌరవం లేదన్న సీజేఐ
కోర్టు ధిక్కరణ చర్యలను చేపట్టమంటారా? అని ప్రశ్న

న్యూఢిల్లీ : ట్రైబ్యునళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన కొత్త చట్టంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పులంటే గౌరవం లేదని అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం… గతంలో తాము రద్దు చేసిన చట్టం వంటిదేనని చెప్పారు. అలాంటి చట్టాన్నే మరొకదాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

ఇప్పుడు తమ ముందు మూడు మార్గాలు ఉన్నాయని.. ట్రైబ్యునళ్లను రద్దు చేయడం లేదా కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేయడం లేదా కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలను చేపట్టడం అని చెప్పారు. ట్రైబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయకపోవడంపై కూడా సీజేఐ మండిపడ్డారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నామని… ఈలోగా తమకు సమాధానం చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/