ఇంటర్నెట్‌ నిలిపివేతపై సుప్రీం ఆగ్రహం

జమ్ము కాశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణకు సుప్రీం ఆదేశాలు

supreme court
supreme court

న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌ లో ఇంటర్‌నెట్‌ పై నిషేధం, భద్రతాపరమైన ఆంక్షలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇంటర్‌నెట్‌ నిలిపివేయడం రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొంది. ఆర్టికల్‌ 19 లో ఇది ఓ భాగమని వ్యాఖ్యానిస్తూ.. ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని అత్యవసర సేవలకు ఇంటర్‌నెట్‌ను పునరుద్ధరించాలని ఆదేశించింది. జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కుల మధ్య సమతుల్యం అవసరమని జస్టిస్‌ ఎన్వీ రమణ నేతఅత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఇంటర్‌నెట్‌ నిషేధంపై వారంలోగా సమీక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఈ బ్యాంకింగ్‌, నిత్యావసవర సేవలకు ఇంటర్‌నెట్‌ అందుబాటులో ఉంచాలని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇంటర్‌నెట్‌పై ఆంక్షలు విధించాలని పేర్కొంది. కాగా అధికారం చెలాయించే పేరుతో పౌరుల ప్రాధమిక హక్కులపై ఆంక్షలు విధించలేరంటూ జస్టిస్ రమణ ఈ సందర్భంగా పేర్కన్నారు.జస్టిస్ రమణతో పాటు ఈ ధర్మాసనంలో జస్టిస్ట్ ఆర్. సుభాష్ రెడ్డి, జస్టిస్ బీఆర్ గవార్ కూడా ఉన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/