రఘురామను సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించండి : ‘సుప్రీం’ ఆదేశం

వై కేటగిరీ భద్రత కొనసాగించాలని ఉత్తర్వులు

SC orders in MP Raghurama case
SC orders in MP Raghurama case

New Delhi: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు కేసులో సోమవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సూచించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామ కు వైద్య పరీక్షలు నిర్వహించాలని , జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని ధర్మాసనం ఆదేశించింది. రఘురామకు వై కేటగిరీ భద్రతను కొనసాగించాలని . ఎంపీకి వైద్య పరీక్షల నిర్వహణ జరిగే కాలాన్ని జ్యుడిషియల్ కస్టడీగా పరిగణించాలని సుప్రీం కోర్టు సూచించింది. ఈ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పాటించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ధర్మాసనం మే 21కి వాయిదా వేసింది. సుప్రీం ఆదేశాలతో ఎంపీ రఘురామకృష్ణం రాజును ఇవాళ సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించనున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/