ఉన్నావ్‌ విచారణపై గడువు పెంపు

Supreme Court
Supreme Court

న్యూఢిల్లీ: ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి కారు ప్రమాదం పై విచారణ గడువును మరో 2 వారాలు పొడిగిస్తూ.. సుప్రీం కోర్టు ఆదేశించింది. విచారణ ను పూర్తి చేసేందుకు 4 వారాల గడువు కావాలని, బాధితురాలు, ఆమె తరపు న్యాయవాది వాంగ్మూలం ఇచ్చే స్థితిలో లేరని సుప్రీం కోర్టును సిబిఐ కోరింది. దీంతో 2 వారాల గడువు ఇచ్చిన కోర్టు.. బాధితురాలి తరపు న్యాయవాదికి వైద్య ఖర్చుల కోసం రూ.5 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని యుపి ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అత్యాచార ఘటనతో పాటు రోడ్డు ప్రమాదం కేసుపై సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. బాధితురాలి వాంగ్మూలాన్ని ఇంకా నమోదు చేయలేదని అందువల్ల విచారణకు మరో నాలుగు వారాల సమయం కావాలని సీబీఐ కోర్టుకు వివరించింది.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/