నిర్భయ దోషి పిటిషన్‌ కొట్టివేత

Supreme Court of India
Supreme Court of India

న్యూఢిల్లీ: నిర్భయదోషి పవన్‌ కుమార్‌ గుప్తా క్యూరేటివ్‌ పిటిషన్‌ సుప్రీం కోర్టు ఈరోజు కొట్టివేసింది. అత్యాచార ఘటన జరిగిన సమయంలో తాను మైనర్ అని ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని పవన్ గుప్తా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇప్పటికే రెండు సార్లు క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేసినప్పటికి పవన్ మరోసారి సుప్రీంలో పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ కొట్టేసింది. అటు ఢిల్లీకోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ ప్రకారం శుక్రవారం ఉదయం 5:30నిమిషాలకు తీహార్ జైల్లో నిర్భయదోషులకు ఉరిశిక్ష అమలుచేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిhttps://www.vaartha.com/andhra-pradesh/