రూ.467 కోట్ల రానిబాకీలకు ఎస్‌బిఐ రికవరీ!

state bank
sbi bank

ముంబయి: రుణాల రికవరీకోసం భారతీయ స్టేట్‌బ్యాంకు 11 నిరర్ధకకాతాల ఆస్తులను ఇ-వేలంద్వారా విక్రయించి 467 కోట్లు రాబట్టాలని నిర్ణయించింది. మహారాష్ట్ర స్టీల్స్‌నుంచి 40.51కోట్లు,అన్షుల్‌స్టీల్స్‌నుంచి 37.70కోట్లు, విధాత మెటల్స్‌నుంచి 36.98కోట్లు, ఇతరఖాతాలనుకూడా ఎంపికచేసి ఈ జాబితాలోని 11 ఖాతాలను విక్రయించి రికవరీచేయాలనినిర్ణయించారు. మొత్తం 11 రానిబాకీల ఖాతాలు వచ్చేనెల ఏడవ తేదీ వేలం వేసి 466.49 కోట్లు రాబట్టాలనినిర్ణయించింది. ఈ 11 ఖాతాలను ఎఆర్‌సిలు, బ్యాంకులు, నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, ఆర్థికసంస్థలు వంటి వాటికి విక్రయించనున్నట్లు ఎస్‌బిఐ వేలంనోటీస్‌లోవ ఎల్లడించింది. ఈనెల 12వ తేదీనాటికే వీటిని వేలం వేస్తామని సంబంధిత సంస్థలకు తెలిపామని వివరించింది. భాటియా గ్లోబల్‌ట్రేడింగ్‌ 177.02 కోట్లు చెల్లించాల్సి ఉంది. భాటియా కోక్‌ అండ్‌ ఎనర్జీ 104.15 కోట్లురాబట్టాలి. భాటియా కోల్‌ వాషరీస్‌నుంచి 12.58 కోట్లు ఏసియన్‌ నేచుల్‌ రిసోర్సెస్‌ 2.18 కోట్లురాబట్టాల్సిఉంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/