పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఎస్బీఐ ఆఫర్‌

SBI
SBI

హైదరాబాద్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు శుభవార్తను అందించింది. వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్‌ అయిన సిబ్బంది మళ్లీ ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకు సంబంధించి ప్రాంతీయ ప్రధాన కార్యాలయం లేదా ఎస్బీఐ సర్కిల్‌ ఆఫీసుల్లో నియామక ప్రక్రియ జరుగుతున్నదని తెలిపింది. ఇదివరకే ఢిల్లీ సర్కిల్‌లో ఉద్యోగ నియామకాలను చేపట్టిన బ్యాంక్‌.. ప్రస్తుతం హైదరాబాద్‌, అమరావతి, పాట్నా, ముంబై మెట్రో, మహారాష్ట్ర పరిధిలో నియామకాలు చేపట్టింది. 60 ఏండ్లలో పదవీ విరమణ చేసిన స్కేల్‌ 1 నుంచి స్కేల్‌ 5 అధికారులు ఇందుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వీరి వయస్సు 63 మించరాదని వెల్లడించింది. కానీ, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వారు లేదా డిస్మిస్‌ అయినవారు ఇందుకు అనర్షులు. రూ.30-40 వేలలోపు వేతనంగా నిర్ణయించింది. ఏడాది కాలపరిమితితో నియామకం చేస్తున్న బ్యాంక్‌.. మరో ఏడాది కూడా పెంచే అవకాశం ఉన్నదని తాజా నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఎంతమందిని తీసుకునేదానిపై బ్యాంక్‌ స్పష్టమైన సమాధానం ఇవ్వకపోయినప్పటికీ, 500 మందిని తీసుకోనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/