ఎస్‌బీఐ ఖాతాదారులకు ఊరట

అన్ని రకాల రుణాలపై వడ్డీ తగ్గింపు

State Bank of India
State Bank of India

హైదరాబాద్‌: ఎస్‌బీఐ ఖాతాదారులకు ఊరట కలిగించింది. ఎంసీఎల్ఆర్ ను 0.5 శాతం మేరకు తగ్గిస్తున్నామని, ఈ నెల 10 నుంచి ఇది అమలవుతుందని వెల్లడించింది. అన్ని రకాల రుణాలపైనా ఈ తగ్గింపు అమలవుతుందని తెలిపింది. కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ను తగ్గించడం ఇది వరుసగా 9వ సారి కావడం గమనార్హం. ఆర్బీఐ రెపో రేటును సవరించకున్నా, రూ. లక్ష కోట్ల వరకూ దీర్ఘకాలిక రెపో ఆపరేషన్ ను ప్రకటించిన నేపథ్యంలోనే, వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు బ్యాంకు తెలిపింది. కాగా, నిన్న జరిగిన పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 5.15 శాతం వద్ద, రివర్స్ రెపో రేటును 4.90 శాతం వద్ద యథాతథంగా ఉంచుతున్నట్టు ఆర్బీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/