ఎస్.బి.ఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులకు అదనంగా రూ.2వేలు

యాజమాన్యాల ప్రకటన

Bank Staff (File)
Bank Staff (File)

New Delhi: కరోనా వైరస్ తో ప్రపంచం అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో పలు దేశాల్లో  లాక్ డౌన్ ని ప్రకటించారు. 

కరోనా ప్రమాదం కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ బ్యాంకు శాఖలకు వెళ్లి తమ సేవలందిస్తున్న ఉద్యోగులకు ఎస్ బి ఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా  యాజమాన్యాలు ఆర్థిక ప్రయోజనాన్ని ప్రకటించాయి.

మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్‌ 14వ తేదీ మధ్య కాలంలో విధులు నిర్వహించిన వారికి రెండువే రూపాయలు అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాయి.

దేశీయ అతిపెద్ద బ్యాంక్‌  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ బ్యాంకు అన్ని శాఖల్లో సేవందిస్తున్న వారికి ఈ మొత్తం అందజేయనున్నట్లు  వెల్లడించింది.

బ్యాంక్‌ ఆఫ్ బరోడా యాజమాన్యం కూడా తమ సిబ్బంది మాస్క్‌లు, గ్లౌజులు, శానిటైజర్లు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఈ మొత్తం అందజేస్తున్నట్లు తెలిపింది.

అలాగే రోజుకి కనీసం 5 ట్రాన్సాక్షన్లు నిర్వహించిన బీసీ ఏజెంట్లకు రూ.100 అందిస్తామని పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/