తెలివి గల మహిళ సావిత్రి

ఆధ్యాత్మిక చింతన

The Story fo Savitri
The Story fo Savitri

అనుకున్నవి సాధించడానికి చదువు సంధ్యలు అక్కలేదనేలా ఆనాటి పతివ్రతల చరిత్రలు, వారు అనుసరించిన పవిత్ర విధానాలు మనకు తెలియచేస్తాయి.

పతిని సేవించడమే, పూజించడమే వివాహిత స్త్రీల పరమధర్మంగా పురాణ స్త్రీల ప్రవర్తనలు ఉంటాయి.

వారు రాకుమార్తెలుగా భోగభాగ్యాలతో తులతూగినా అవసరమయితే అవన్నీ తృణప్రాయంగా, తృణీకరించి అనుకున్న మార్గంలో పయనించగలనే సూత్రం సీత, తార, అహల్య, ద్రౌపది, మండోదరి, అనసూయల వంటి పతివ్రతల ద్వారా మానవలోకానికి అవగతం అవుతాయి.

సుమంగళిగానే తనువ్ఞ చాలించాలని భావించే స్త్రీలు దురదృష్టవశాన, కర్మానుసారంగా, భర్తృవిహీనలు అవుతుంటారు.

కాబోయే భర్త ఒక సంవత్సర కాలమే జీవిస్తాడని ముంతే తెలిసి తల్లిదండ్రులు, నారదుడు వద్దని వారించినా తాను వలచిన సత్యవంతుడిని పెళ్లాడి, ఆయన వెంటే ఆనందంగా నడిచిన సావిత్రి. ఆ తరువాత ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి.

గడువ్ఞ ప్రకారం ఏడాది ఆయువ్ఞ ముగియగానే సత్యవంతుడు అడవిలో సావిత్రి ఒడిలోనే ప్రాణాలు కోల్పోతాడు.

సత్యవంతుడి ప్రాణం పాశంతో బంధించి తనతో తీసుకువెళ్లే యముడిని, సావిత్రి ప్రత్యక్షంగా, తన పాతివ్రత్య మహిమతో చూచి ఆయనను వెంబడించి కఠినమైన దారులలో పయనించింది.

అది చూచి విస్మయుడైన యముడు ఆమె పతి ప్రాణాలు తప్ప వేరే వరాలు కోరుకొమ్మని అంటే ..

సావిత్రి చాకచక్యంగా పుత్ర సంతానం లేని తన తల్లిదండ్రులకు కొడుకులను, అంధుడై, రాజ్యం పొగొట్టుకున్న మామ ద్యుమత్సేన మహారాజుకు కళ్లు, రాజ్యం తిరిగి లభించే వరాల్ని కోరింది.

మూడవ వరంగా పుత్రభిక్షను అడగడంలో ఆ సాధ్వి మేధ అద్భుతంగా అనిపించేలా యముడు కూడా ఆలోచించకుండా ఆ వరాల్ని ప్రసాదించడం, తెలివిగా సావిత్రి యముడితో పతి మృతి చెందితే పుత్రులు ఎలా కలుగగలరు?

కనుక సత్యవంతుడిని బ్రతికించి తీరాలని యముడినే సవాలు చేసిన ఆమె ధీరత్వం, పురాణ స్త్రీల మహత్యాలను, ధైర్యాలను, తెలివితేటలను తేట తెల్లం గావించేలా ఉంటాయి.

పతినే ప్రత్యక్షదైవంగా ఆరాధించే స్త్రీలకు సాధ్యం కానిది లేదనేలా మద్రదేశ మహారాజు అశ్వపతి కూతురు సావిత్రి అద్వితీయగాధ విన్నా, చదివినా, ఉదాత్తంగా ఉండి, ఉత్తమ భరతఖండ చరిత్రగా భాసిల్లుతుంది.

  • యం.వి.రమణకుమారి

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/