పొదుపు పాఠాలు
పిల్లల పెంపకం- పెద్దల బాధ్యతలు

పిల్లలకు ఆర్ధిక అలవాట్లు అమ్మ నేర్పించాలి. వాటిని పాఠాలుగా చెప్పినట్లుగా కాకుండా రోజువారి పనుల్లో భాగంగా నేర్పాలి.
పిల్లలకు డబ్బులిచ్చి ఏమైనా కొనుక్కోమంటే దుకాణానికి వెళ్లి పిల్లాడు ఎంత ఎంత ధరలో వస్తుందో ఆరా తీస్తాడు. అలా వాటి ధరలు తెలుసుకున్న తరువాత తనకు కావలసింది ఏ ధరలో ఉందో తెలుసుకుంటాడు.
అదేవిధంగా తన వద్ద ఎంత ఉందో చూసుకుని ఆ ధరలో ఏం వస్తుందో కొనుక్కుంటాడు.
అలా ప్రాక్టికల్‌గా వారిని ప్రతి పనిలో పాలుపంచుకునేలా చేస్తే ఒక అర్ధవంతమైన వినియోగదారుడు, పెట్టుబడిదారు, పొదుపు వంటి వాటి గురించి తెలుసుకుంటాడు.
అలా వారికి చిన్ననాటి నుండే ఆ విషయాలు తెలియడం కూడా మంచిది. అయితే వయసును బట్టి నేర్పు పద్ధతిని మార్చుకోవాలి.

యేడేళ్ల వయసు పిల్లలకు రెండు బాక్స్‌లు ఇచ్చి ఒకటి డబ్బులు పొదుపు చేసుకోమని, ఒకటి డబ్బులు దాచుకోమని చెప్పాలి.
డబ్బులు వేసే డబ్బాలోని వాటితో పెద్ద వస్తువులు కొనుక్కోవటానికి అని చెప్పాలి. పొదుపు కోసం దాచే వాటితో చిరుతిళ్లు కొనుక్కునేందుకు అని చెప్పాలి.
ఎవరికైనా జాలిపడి కొంత ఇవ్వాలనుకున్నప్పుడు అది విడిగా దాచుకునే దాంట్లోంచి ఇమ్మంటే పిల్లలకు దానగుణం కూడా అలవడుతుంది.
అయితే పిల్లలకు డబ్బులివ్వడమే కాదు. అందుకు ఏదైనా లక్ష్యంగా పెట్టుకోమని కూడా చెప్పాలి. డబ్బులతో ఏం కొనుక్కోవాలనుకుంటున్నారో అడగాలి.
అందుకు ఎంత ఖర్చు అవుతోంది చెప్పి అధి కొనేవరకు వారిని ప్రోత్సహించాలి.
ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూ ఒక్కసారి ఆ మొత్తం సమకూరాక ఆ డబ్బుతో వారు అనుకున్న వస్తువు వారితోనే కొనిపించాలి.
అలా చేస్తే వారికి డబ్బులు సంపాదించి కావాల్సిన దానిని కొనుక్కోవడానికి పడే కష్టం విలువను తెలియచేస్తుంది. పదమూడేళ్ల వయసు పిల్లలను ఆర్ధిక నిర్ణయాలలో పాలు పంచుకునేలా చూడాలి.
ఒకే వస్తువు వేర్వేరు బ్రాండ్లలో తక్కువకు వచ్చేది ఏదో తెలుసుకునే వివరించాలి. రోజు మనం కొనే పాలు, గుడ్లు వంటి వాటిని కనీసం రూపాయి తగ్గేలా ఎలా కొనవచ్చో గమనించేలా చేయాలి.
వీలయితే అవి తెచ్చేటప్పుడు రోజు వారిని కూడా వెంట తీసుకెళ్లాలి.
ఇంటి పనుల్లో సహాయం చేసినప్పుడు, కూరగాయలు తరిగిపెట్టమన్నప్పుడు పిల్లలకు వారు కొన్ని డబ్బులిచ్చి దాచుకోమనాలి.
ఇలా ఏవైనా పనులు చేసినపుడు వారిని ఉత్సాహపరుస్తూ డబ్బు విలువలను తెలియచెపుతుండాలి.
డబ్బులు పరిమితమని, అపరిమితం కాదని తెలియజెప్పాలి. సూపర్ మార్కెట్‌కి వెళ్లినప్పుడు వంద రూపాయలతో ఏం కొనవచ్చో పరిశీలించమనాలి. ఆ వందలోనే ఏం కొనాలి. ఎంత మిగల్చాలి అన్నది తెలుసుకుంటారు.

షాపింగ్‌కు వెళ్లినపుడు రెండు ఒకంటే ఒకటి ఉచితంగా వంటివి ఉంటుంటాయి. అయితే అటువంటి ఆఫర్లు ఏయే బ్రాండ్లపై ఉన్నాయో వారిని కూడా తెలుసుకునేలా చేయాలి.
ఇక పద్దెనిమిదేళ్ల వయసు పిల్లలు స్కూల్లో మ్యాథ్స్ నేర్చుకునే ఉంటారు. అయితే వాటిని జీవితంలో ఎలా అన్వయించుకోవాలో తెలిసేలా చేయాలి.
చిన్న వయసు నుండే యేడాదికి అయిదు వేల చొప్పున ఆదా చేస్తే పెద్దయేసరికి ఎంతవుతుంది.
ఆ లెక్కల నుంచి తక్కువ వయసులో పొదుపు, మదుపు చేస్తే వచ్చే ప్రయోజనాలు వారికి తెలుస్తాయి. అలా చిన్న వయసులో మదుపు గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు.
విద్యార్థి దశ నుండే వారికి తమ చదువుకు అయ్యేఖర్చు గురించి వివరిస్తూ ఉంటే ఇంటి ఆర్థిక పరిస్థితులు, వనరులు వారు కూడా తెలుసుకునే అవకాశముంటుంది.

దాంతో మంచి ర్యాంకు తెచ్చుకుంటే ఉచితంగా సీటు సాధించవచ్చుననే అంశాలపై వారికి ఆసక్తి పెరిగి అందుకు కృషి చేస్తారు.
చదువుకు సంబంధించిన రుణ సదుపాయం, స్కాలర్‌షిప్‌ల వంటి అంశాలు వారికి అవగాహన కల్పిస్తే అందుకు ఎలా కృషి చేయాలో ఆలోచిస్తారు.
ఇరవైయేళ్ల వయసు వారికి చాలా విషయాలు తెలిసి ఉంటాయి కాబట్టి తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ప్రయత్నించే పథకాలు వేస్తుంటారు. సొంత నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం వారికి వస్తుంది.
బ్యాంకు ఖాతాల నిర్వహణ, క్రెడిట్ కార్డుల వినియోగం వంటివి ఈ వయసులో వారికి చెపితేనే మంచిది. వీలయితే నెలకు కనీస మొత్తాన్ని వారితోనే అందులో పెట్టించవచ్చు.
ఇంకా అయితే ఉద్యోగం చేయాల, వ్యాపారం ఏదైనా చేయగలమా అని కూడా నిర్ణయించుకునే సామర్ధ్యాన్ని సంపాదించు కోగలుగుతారు.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/